మాస్కో: వాయువ్య రష్యాలో కీలకమైన ఎరువుల ప్లాంట్ ‘ఫోస్ ఆగ్రో’పై ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసింది. ఏప్రిల్ నెలలో ఈ ప్లాంట్‌పై దాడి జరగడం ఇది రెండోసారి. రష్యా కీలక ఎగుమతి కేంద్రాలపై ఇటీవల కాలంలో ఉక్రెయిన్ దాడులు తీవ్రమయ్యాయి. ఈ ప్లాంట్‌లోని సల్ఫూరిక్ యాసిడ్ పంప్ చేసే హై ప్రెజర్ పైప్‌లైన్లను ఈ డ్రోన్లు ధ్వంసం చేశాయి. ఈ విషయాన్ని వోలోగ్డా గవర్నర్ జార్జి ఫలిమొనోవ్ ధృవీకరించారు. కాకపోతే ఎటువంటి మంటలు లేదా లీకేజీకి ఈ దాడి కారణం కాలేదని వెల్లడించారు.

పైప్‌లైన్‌కు వెంటనే మరమ్మతులు నిర్వహించినట్లు తెలిపారు. దీంతో ప్రమాదకర గ్యాస్‌లు కూడా ఏమీ లీక్ కాలేదని చెప్పారు. ‘ఫోస్ అగ్రో’ ప్రతినధి మాత్రం ఈ దాడిపై స్పందించేందుకు నిరాకరించారు. ప్రస్తుతం పశ్చిమాసియా యు్ధం తీవ్రస్థాయిలో ఉండటంతో నైట్రోజన్ ఫర్టిలైజర్స్ ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో పాటు రష్యా, చైనా దేశలు వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. రష్యా వంటి ఫాస్ఫరస్ ఆధారిత ఎరువులను భారత్‌కు ఎగువతి చేసే కంపెనీల్లో ఇది కూడా ఉంది.