ఐపీఎల్‌ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటర్లు పూర్తిగా విఫలమై 16.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది.

ఈ విజయంతో గుజరాత్‌ టైటాన్స్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్‌కు దాదాపు అర్హత ఖాయం చేసుకుంది. మరోవైపు వరుస ఓటములతో రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 5 ఓటములతో కొనసాగుతోంది.