నవతెలంగాణ – హైదరబాద్ : సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఏపీ, తెలంగాణలో కోడిగుడ్ల ధరలు మళ్లీ పెరిగాయి. ఎండాకాలం ప్రభావంతో ఉత్పత్తి తగ్గడం, విదేశాలకు ఎగుమతులు పెరగడం వల్ల డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో ఒక్క గుడ్డు ధర రూ.7 వరకు చేరగా, హోల్‌సేల్‌లో రూ.6.30కు లభిస్తోంది. దీంతో హోటళ్లలో ఎగ్‌తో చేసే వంటకాల ధరలు పెరుగుతున్నాయి.
The post సామాన్యులకు మరో షాక్.. appeared first on Navatelangana.







