
సౌందర్యానికి, ఫిట్‌నెస్‌కు కేవలం ఖరీదైన డైట్ ప్లాన్‌లు మాత్రమే అవసరం లేదని.. మన ఇంటి పాతకాలపు వంటకాలు కూడా అద్భుతాలు చేస్తాయని నిధి అగర్వాల్ నిరూపిస్తోంది. ఈ అందాల భామ తన గ్లామర్ రహస్యం పెరుగన్నం అని చెప్పి ఆశ్చర్యపరిచారు. ముందు రోజు రాత్రి అన్నంలో పెరుగు కలిపి తర్వాత రోజు ఉదయం ఆ చద్దన్నం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అపారమని, ఇది శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుందని ఆమె తన అనుభవాన్ని షేర్ చేశారు. పెరుగన్నంలో ఉండే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.'














