తమిళనాడుకు తరువాతి సిఎం ఎవరు అనే సర్వేల్లో కూడా విజయ్ ఇతరులతో పోలిస్తే ముందున్నారు. ఆయనకు సిఎం పదవి విషయంలో 37 శాతం మద్దతు ఉందని, తరువాతి స్థానంలో స్టాలిన్‌ను 35 శాతం మంది కోరుకుంటున్నారని తెలిపారు. విజయ్‌కు యువతలో మంచి క్రేజ్ ఉంది. రాజకీయాల్లో పేరు మార్మోగింది. 18 నుంచి 19 సంవత్సరాల లోపు తొలిసారి ఓటర్లలో ఏకంగా విజయ్‌కు 68 శాతం మంది మద్దతు ఇచ్చారని వెల్లడైంది. నిరుద్యోగ యువత, అర్బన్ ఓటర్లు, ప్రత్యేకించి బిసిలు, మైనార్టీ ఓటర్లు , ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలోని నియోజకవర్గాలలో కూడా విజయ్‌కు మంచి ఆదరణ ఉందని తేల్చారు.

ఈ విషయాలను కేంద్రంలోని బిజెపి వర్గాలు విస్తృత స్థాయిలో పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడైంది. ఇక తమిళనాడులో అధికార మార్పిడికి ఎక్కువగా జనం మొగ్గుచూపుతున్నారు. ఇది ప్రధాన అంశం అయింది. డిఎంకె లేదా అన్నాడిఎంకెలతో జనం విసిగిపోయారు. విజయ్‌కు మద్దతు ఇస్తున్న వారిలో 35 శాతం మంది వరకూ రాష్ట్రంలో అధికార మార్పిడిని ఇష్టపడుతున్నట్లు తెలిసింది. ఇతర పక్షాలతో పోలిస్తే టివికె విజయ్‌కు మద్దతు ఇప్పుడు 77 శాతం జనం మద్ధతు ఉందని పలు అంశాల విశ్లేషణలతో వెల్లడైంది.