సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డిఆర్ఐ అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలను పట్టుకుని, వారి వద్ద నుండి 11.4 కేజీల యాంఫేటమైన్ (Amphetamine)  స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.11.4 కోట్లు ఉంటుందని అంచనా. బ్లాక్ కవర్లుల్లో, డిజైనర్ పేపర్‌తో కప్పి, బెడ్‌షీట్‌ల మడతల్లో దాచి మహిళలు స్మగ్లింగ్ చేస్తున్నారు.ఇద్దరు మహిళ నిందితులను డిఆరఐ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.