
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్ కానుకగా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదే ఈ సినిమాలో విలన్‌గా నటించేది ఎవరనే విషయంపై చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఓ ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వాళ్లే మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్, బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా. ‘పుష్ప’ రెండు సినిమాల్లో ఫహాద్ విలన్‌గా మెప్పించిన విషయం తెలిసిందే. ఇక రణ్‌వీర్ సింగ్ హీరోగా అదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురందర్-1’ సినిమాలో విలన్‌గా అక్షయ్ ఖన్నా తన నటనతో ఆకట్టుకున్నారు. దీంతో ఈ మెగా ప్రాజెక్టులో ఒకరికి విలన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉందని టాక్. సల్మాన్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి తగ్గట్టుగా ఆయనకు ఎవరూ పోటీ ఇస్తారో వాళ్లే విలన్‌గా ఉండాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.












