హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘మా ఇంటి బంగారం’. సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. మంగళవారం సామ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాలో సామ్ నటించిన యాక్షన్ సీక్వెన్స్ పై మేకర్స్ ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

ఇక ‘ఓ బేబీ’ సినిమా తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత చేస్తున్న రెండో సినిమా ఇది. సమంత భర్త రాజ్ నిడిమోరు, వసంత్ మారిగంటితో కలిసి ఈ సినిమాకు కథ అందించారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మే 15న ఈ సినిమాను థీయేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స ప్రకటించారు.