
అమరావతి: వైసిపి హయాంలో పరిశ్రమలు వెనక్కు వెళ్లాయని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అందిస్తామని హామీ ఇస్తే కూటమిని గెలిపించారని అన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో క్లీన్ ఎనర్జి ప్లాంట్ ప్రాజెక్టు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు పాల్గొన్నారు. మొత్తం రూ.5,400 కోట్ల పెట్టుబుడులతో ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..2019- 2024 మధ్య రాష్ట్రంలో విధ్వంసం చేశారని, గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. వైసిపి హయాంలో ఎక్కడ చూసినా అవినీతి అని మండిపడ్డారు. ఉచితంగా సోలార్ ఎనర్జీని వినియోగించుకోలేదని, గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజల అదనపు భారం మోపిందని ధ్వజమెత్తారు. భవిష్యత్ లో ఆర్టిసి బస్సులన్నీ వైయ్యికి పైగా ఎలక్ట్రిక్ బస్ లుగా మారుస్తామని, ప్రతీ ఇల్లు ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని అన్నారు. రైతులు కూడా పొలం దగ్గరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలని, రూ.20 లక్షల 74 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని తెలియజేశారు.
ఎంవొయూ చేసి మూలకు పడేయం తమ పాలసీ కాదని, ఎవరికి ఎంత కరెంటు కావాలో అంత కరెంటు ఇస్తామని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి చేరుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. 22 నెలలుగా ఒక్క పైసా కరెంటు ఛార్జీ పెంచలేదని, కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత కరెంట్ సమస్యలు పరిష్కరించామని అన్నారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చేశామని, గత ప్రభుత్వం ప్రజలపై ట్రూఫ్ అప్ ఛార్జీల భారం వేస్తే.. తాము తగ్గించామని అన్నారు. భవిష్యత్ లో కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నామని, తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి జరగాలని రైతులకు సూచించారు. సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇవ్వాలని, రైతులే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలని అన్నారు. రెండు మూడేళ్లలో 40 లక్షల రూప్ టాప్ కరెంట్ లభిస్తుందని, భవిష్యత్ లో 5వేల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.














