
బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ కుమార్ కుమార్తెకు లైంగిక వేధింపుల కేసులో మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సైబర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు యశస్వీ మీడియాకు వెల్లడించారు. తన కుమార్తె వేధింపులకు గురవుతున్నట్లు అక్షయ్ కుమర్ స్వయంగా అధికారుల దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ధైర్యంగా తనకు ఎదురైన ఇబ్బందిని చెప్పడం వల్లే నిందితుడిని పట్టుకోవడం సాధ్యమందని తెలిపారు.
గతేడాది అక్టోబర్‌లో ముంబై పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అక్షయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ గురించి అక్షయ్ మాట్లాడుతూ.. తన ఇంట్లో జరిగిన ఓ ఘటన గురించి తెలిపారు. తన కుమార్తె ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతుండగా.. గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆమెకు అసభ్యకరంగా మెసేజ్ చేశాడని అన్నారు. ఆమె న్యూడ్ ఫోటోలను పంపించాలని అతను అడిగాడని పేర్కొన్నారు. ఈ విషయం అక్షయ్ కుమార్తె ఇంట్లో చెప్పడంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించేలా సైబర్ ఎడ్యుకేషన్‌ను వీక్లీ సబ్జెక్ట్‌గా పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.













