న్యూఢిల్లీ ః దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. స్విట్జర్లాండ్‌లోని జూరిచ్‌కు బయటుదేరిన స్విస్ విమానం ప్రమాదానికి గురైంది. విమానం టేకాఫ్ దశలో ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీనితో సమయస్ఫూర్తితో వ్యవహరించిన పైలట్ టేకాఫ్ దశలోనే నిలిపివేశారు. అత్యవసర ద్వారాల నుంచి ప్రయాణికులను దింపారు. ఈ క్రమంలోనే కొందరికి గాయాలు అయినట్లు స్విస్ ఎయిర్‌లైన్స్ అధికారులు ధృవీకరించారు.