అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన వార్షిక టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడో స్థానంలో నిలిచింది. భారత జట్టు 104 పాయింట్లతో టాప్3లో చోటు సంపాదించింది. ఆస్ట్రేలియా 131 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సౌతాఫ్రికా 119 పాయింట్లతో రెండో స్థానాన్ని కాపాడుకుంది. న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మాత్రం టీమిండియా ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి డబ్లూటిసిలో భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మెరుగైన స్థానంలో నిలిచాయి.