తెలంగాణ ప్రభుత్వం కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.

1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ ఇప్పటివరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ (DGP)గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన గతంలో రెండు సార్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కూడా సేవలందించారు.

c v anand.jpg

ఇటీవల యూపీఎస్సీ డీజీపీ పోస్టుకు అర్హులైన అధికారుల జాబితాను రాష్ట్రానికి పంపింది. ఆ జాబితాలో సీవీ ఆనంద్‌తో పాటు వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లు ఉన్నాయి. వీరిలో అత్యంత సీనియర్ అయిన సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది.