తెలంగాణ కొత్త పోలీస్ బాస్ గా సివి ఆనంద్ ప్రమోషన్ అందుకున్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం.. ఆయనను డిజిపిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన సివి ఆనంద్.. రాష్ట్ర పోలీస్ శాఖలో పలు హోదాలో పనిచేశారు. ప్రస్తుతం హోం సెక్రెటరీగా ఉన్న సివి ఆనంద్.. డిజిపి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర డిజిపిగా పనిచేస్తున్న శివధర్ రెడ్డి.. ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు.