
హైదరాబాద్: నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లె క్కింపు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో కౌంటింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్ లో టిఎంసి, బిజెపి చెరో 16 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో డిఎంకె 10, అన్నాడిఎంకె 4, ఇతరలు 1, కేరళ రాష్ట్రంలో ఎల్ డిఎఫ్ 30, యుడిఎఫ్ 32, ఎన్డిఎ 3 స్థానాలలో, అస్సాంలో బిజెపి కూటమి 11, కాంగ్రెస్ కూటమి 3 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. బెంగాల్‌లో 77, తమిళనాడులో 62, కేరళంలో 43, అసోంలో 40, పుదుచ్చేరిలో 6 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతోంది.
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 148 సీట్లు
తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 118 సీట్లు
కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 71 సీట్లు
అసోంలో మొత్తం 126 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 64 సీట్లు
పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 16 సీట్లు












