దర్శకుడు అట్లీఈ ఏడాది ఆరంభంలో తన భార్య గర్భం దాల్చినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ 20వ తేదీన తన భార్య ప్రియకు సాప పుట్టినట్లు తెలిపాడు. తాజాగా ఆ పాప పేరును వెల్లడించాడు. తన భార్య ప్రియ, కుమారడు మీర్ ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసి వచ్చేలా మియూ(MIYOU) అని నామకరణం చేశాడు. మియూ అంటే అందం, ప్రేమకు చిరునామా అని తెలిపాడు. అలాగే మి అంటే నేను, యు అంటే నువ్వు.. అని అర్థం వచ్చేలా మియూ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి అభిమానులు అట్లీక కంగ్రాన్స్ చెప్తూ కామెంట్లు చేస్తున్నారు. అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘రాకా’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు.