ఢిల్లీ: ఇంట్లో ఎసి పేలడంతో తొమ్మిది మంది మృతి చెందిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వివేక్ విహార్‌లో ఆదివారం వేకువజామున ఎసి పేలడంలో మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు పొగ ఎక్కువగా రావడంతో ఊపిరాడక తొమ్మిది మంది మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు సిబ్బంది 12 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. పోలీసులు తొమ్మిది మృతదేహాలను గుర్తించామని చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.