హైదరాబాద్: తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తమదేనని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో సిఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఉద్యోగ సంఘాలకు సిఎం స్పష్టత ఇచ్చారు. 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు చెల్లింపుల కోసం రూ.6వేల కోట్లు ఇస్తామని చెప్పారు. పిఆర్సిపై తక్షణమే రిపోర్టు ఇవ్వాలని అధికారుల కమిటీని ఆదేశించామని.. ఆ రిపోర్టు ఆధారంగా పిఆర్సిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. రెండు నెలలకోసారి ఉద్యోగుల సమస్యలపై గుర్తింపు సంఘాలు నివేదిక ఇవ్వాలని సూచించారు.