
భారత్ ఆయుధ పరంగా మరింత పటిష్టం కానుంది. రష్యా నుంచి ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ నాలుగో యూనిట్ వచ్చే నెలలో చేరుకోనుంది ఈ మేరకు మంగళవారంనాడు కేంద్ర ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. ఎస్ 400 వ్యవస్థ మే నెల మొదటి వారంలోనే భారత్‌కు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రష్యా నుంచి బయలుదేరినట్లు వెల్లడించారు. ఎస్-400 ట్రియంఫ్ క్షిపణి వ్యవస్థ నాలుగో యూనిట్ భారత్‌కు చేరితే దేశ వైమానిక దళ సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
అక్టోబర్ 2018లో అధునాతన ఎస్-400 క్షిపణి వ్యవస్థకు చెందిన ఐదు యూనిట్లను కొనుగోలు చేసేందుకు రష్యాతో భారత్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ 5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పటికే మూడు ఎస్-400 యూనిట్లను భారత్‌కు రష్యా అందించింది. చివరిది అయిన ఐదో యూనిట్ నవంబర్ నాటికి రష్యా అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒప్పందం ప్రకారం అన్ని భారత్‌కు చేరితే దేశంలో ఎస్-400 క్షిపణి వ్యవస్థల సంఖ్య 10కి చేరుతుంది.














