
బెంగళూరు: ఐపిఎల్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. జిటిపై ఆర్‌సిబి ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఆర్‌సిబి విజయంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు. 44 బంతుల్లో 81 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు. జిటి తొలుత మూదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. అనంతరం 18.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ సెంచరీ వృధాగా మారింది. ఆర్‌సిబి తొలి ఓవర్‌లో విరాట్ కోహ్లీ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. సిరాజ్ బౌలింగ్‌లో బంతి విరాట్ బ్యాట్ అంచుకు తగిలి వాషింగ్టన్ సుందర్ చేతిలో పడింది. ఈజీ క్యాచ్‌ను సుందర్ మిస్ చేయడంతో విరాట్ బతికిపోయాడు. తొలి ఓవర్‌లోనే విరాట్ వికెట్ పడి ఉంటే గెలిచే అవకాశాలు ఉండేవి కావు. ఈ తప్పిదంతోనే జిటి ఓటమిని చవి చూసింది.













