
మేషం: మేషరాశి వారికి వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగాలపరంగా మంచి కలుసుబాటు తినంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతాన విద్యా ఫలితాలు ఉత్సాహ పరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శ్రీ నడుస్తుంది కావున ప్రతిరోజు శని గ్రహ స్తోత్రం మరియు శివతాండవ స్తోత్రం చదవండి లేదా వినండి. దూరప్రయాణ సూచనలున్నవి. మీరు సొంతంగా తీసుకునే నిర్ణయాలు లాబిస్తాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజ చేయండి. మంగళవారం మరి శుక్రవారం రోజున ఇంట్లో సాంబ్రాణితో ధూపం వేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి రెండు కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి కష్టపడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు ఆచీతూచి మాట్లాడాలి.చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. విదేశీ ప్రయాణం చేస్తారు. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. ఓం నమో నారాయణ వత్తులతో లక్ష్మీ తామర వత్తులు కలిపి దీపారాధన చేయండి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మిధునం: మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రభుత్వపరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ చేతికి అందుతాయి. నూతన ఉద్యోగం ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్తీకంగా కూడా మంచి కలిసి బాడుతనంగా ఉంటుంది. వీసా పాస్పోర్ట్ వంటి అంశాలు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారంలో లాభాలు మరియు నష్టాలు సమానంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలు పరుస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది జాతక పొంతనలు చూసుకొని ముందుకు వెళ్లడం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఈ శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఆరావళి కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి
కర్కాటకం: కర్కాటక రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం చికాకు పెడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కుటుంబ వాతావరణం వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. మనశ్శాంతి లోపిస్తుంది. ఒక ప్రణాళిక బద్ధంగా మీరు తీసుకున్న నిర్ణయాలను అమలుపరచండి మంచి ఫలితాలు పొందుతారు.చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తులాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో ప్రయత్నకార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తులను విక్రయించి రుణాలను తీరుస్తారు ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అంతంత మాత్రం గా ఉంది. ఈ శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో లక్ష్మీ తామర వత్తులు కలిపి దీపారాధన చేయండి. అదేవిధంగా ఆరావళి కుంకుమ మొగలి పువ్వు కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి మంచి ఫలితాలు సంక్రాంతి స్థాయి. ఈ రాశి వారికి కలసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
సింహం: సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వారం శుభవార్త వినేటువంటి అవకాశం ఉంది. మధ్యవర్తి సంతకాల కు దూరంగా ఉండండి.ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఈ శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. జిల్లేడు వినాయకుడిని జిల్లేడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వ్యాపార ప్రదేశాలలో ఉంచి పూజ చేయండి. ప్రతిరోజు కూడా అమ్మవారికి ఆరావళి కుంకుమ మొగలిపువ్వు కుంకుమతో అష్టోత్తరంతో పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కన్య: కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎంతోకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉన్నవారికి ఈవారం ఇది కోరుకున్న మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార విస్తరణ చేస్తారు.చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఈ వారం ఒక శుభవార్త వింటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన గృహం కొనుగోలు చేస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి నూతన పదవులు లభిస్తాయి. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో లక్ష్మీ తామర వత్తులు కలిపి దీపారాధన చేయండి. అలాగే ఆరావళి కుంకుమ మొగలి పువ్వు కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసివచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
తుల: తులారాశి వారికి వారం చాలావరకు అనుకూలంగా ఉంది. భూ సంబంధమైన వ్యవహారాలు సానుకూల పడతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పొదుపు పైన దృష్టి పెడతారు. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు.బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో మొగిలిపోవు కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు నేవీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ప్రైవేట్ సంస్థలో ఉన్న వారికి ప్రమోషన్స్ లభిస్తాయి.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వృశ్చిక రాశి వారికి బాగుంటుందని చెప్పవచ్చు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో లక్ష్మీ తామరవత్తులు కలిపి దీపారాధన చేయండి. ఆరావలి కుంకుమతో మొగలిపువ్వు కుంకుమతో కుబేర కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మృత ఉద్యోగులపరంగా వ్యాపార పరంగా బాగుంటుంది.. కెరియర్ పరంగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ గానే ఇంక్రిమెంట్ కానీ లభిస్తుంది. విదేశాలలో ఉన్న వారికి పి ఆర్ లభిస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మీ రాశి వారు ప్రతి రోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. విద్యార్థినీ విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఓం నమో నారాయణ వత్తులతో లక్ష్మీ తామర వత్తులు కలిపి దీపారాధన చేయండి. అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో మొగలి పువ్వు కుంకుమతో అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి
మకరం: మకర రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపార పరంగా మీరు కోరుకున్న అభివృద్ధిని సాధించ గలుగుతారు. దూర ప్రాంతాల ప్రయాణం విషయంలో ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలపరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. బంధు వర్గంతో ఉన్నత అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఓం నమో నారాయణ వత్తులతో లక్ష్మీ తామర వత్తులు కలిపి దీపారాధన చేయండి. అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో మొగలి పువ్వు కుంకుమతో అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా అంతంతమాత్రంగా ఉంటుంది. ఉద్యోగపరంగా స్థాన చలనం ఉండే అవకాశం ఉంది. నూతన గృహం కొనుగోలు చేస్తారు.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రతి విషయంలో కూడా తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభఫలితాలు పొందుతారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఓం నమో నారాయణ వత్తులతో లక్ష్మీ తామర వత్తులు కలిపి దీపారాధన చేయండి. అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో మొగలి పువ్వు కుంకుమతో అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి. ని రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుగు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మీనం: మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది.చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున మీ పని తీరుకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. దైవదర్శనం చేసుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఓం నమో నారాయణ వత్తులతో లక్ష్మీ తామర వత్తులు కలిపి దీపారాధన చేయండి. అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో మొగలి పువ్వు కుంకుమతో అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి. విదేశాలు వెళ్లి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా ఎనిమిది కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.








