
మన తెలంగాణ / హైదరాబాద్ : సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సిఎంతో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డిజిపి, ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.








