
హైదరాబాద్: బిఆర్ఎస్ పాలనలో రైతుబంధు డబ్బుల కోసం బిఆర్ఎస్ ను కుదువపట్టారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. రెండున్నరేళ్లలోపే రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం అని అన్నారు. మాజీ సిఎం వ్యాఖ్యలను అడ్లూరి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వడ్డీలు కట్టలేక ఉద్యోగులకు జీతం ఇవ్వలేని స్థితికి తెచ్చారని విమర్శించారు. గత పదేళ్లలో ప్రతిపక్ష నేతలు కనీసం మాట్లాడలేని పరిస్థితులు ఉండేవని తెలియజేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు విమర్శిచడం సరికాదని అన్నారు. పార్టీ వీడవద్దని కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశామని, వారం రోజుల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రులను సిఎం కలిసినా స్పందన లేదని, వడ్ల కొనుగోళ్లు, యూరియా విషయంలో ఇబ్బందులు లేవు అని అన్నారు. 2028 ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని, జగిత్యాలలో సభ ఉన్నా మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వెళ్లడం వెనుక ఆంతర్యమేంటి? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి చూపిస్తామని అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు.













