తిరుపతి: తిరుమలలో భక్తురాలు అదృశ్యమయ్యారు. గుంటూరు జిల్లా సంగడిగుంటకు చెందిన ఉప్పు లక్ష్మీ తిరుపతమ్మ (27) అనే యువతి శ్రీవారి దర్శన కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. హెచ్ విసి 694ఎ గది నుంచి మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు బయటకు వెళ్లారు. అప్పటి నుంచి యువతి కనిపించకపోవడంతో పోలీసులు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇటీవలే సదరు యువతికి పెద్దలు వివాహం కుదిర్చారు. పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.