ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ రెండు పతకాలు సాధించింది. భారత వెయిట్ లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ ఈ పోటీల్లో ఓ రజతం, మరో కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల స్నాచ్ విభాగంలో జ్ఞానేశ్వరి రజత పతకాన్ని గెలుచుకుంది. అంతేగామహిళల 53 కిలోల ఓవరాల్ విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ కాంస్య పతకం సాధించింది. ఓవరాల్‌గా 194 కిలోల బరువును ఎత్తిన జ్ఞానేశ్వరి మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది.