భంగపడినట్లు ఇప్పుడు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చేతిలో మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికీ తప్పదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. సోమవారం కాంగ్రెస్‌పై కెసిఆర్, టి. జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఎంపీ మల్లు రవి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కెసిఆర్‌కు నమ్మించి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని ఆయన తెలిపారు. కెసిఆర్‌తో ఏమి ఉపయోగం లేదని ఎన్నికల్లో రుజువైందని అన్నారు. కెసిఆర్ ఎన్ని మాటలు చెప్పినా ప్రజా ప్రభుత్వానికి ఏమి కాదని, ప్రజలకు తమ వైపు ఉన్నారని ఆయన తెలిపారు. త్రేతాయుగంలో రావణుడి చేతిలో విభీషణుడు భంగపడినట్లు కలియుగంలో కెసిఆర్ చేతిలో జీవన్ రెడ్డికి భంగపాటు తప్పదని ఆయన అన్నారు. 42 ఏళ్ళు జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లో అనేక పదవులు అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్‌ను విమర్శించడం భావ్యం కాదని ఆయన విమర్శించారు. తాను చెప్పినట్లు కాంగ్రెస్ వినలేదని జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి పోవడంతో 42 ఏండ్ల వ్యక్తి గత ప్రతిష్టను దిగజార్చుకున్నారని ఆయన తెలిపారు. ఏఐసిసి అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు రేవంత్ రెడ్డి కులగణన నిర్వహించారని మల్లు రవి చెప్పారు.