నవతెలంగాణ-రాయికల్పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో “తరంగిణి-2026”వార్షికోత్సవ వేడుకలను మంగళవారం ఆర్‌ఆర్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జూపల్లి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ… విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంలో వార్షికోత్సవాలు కీలకమని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లోనూ రాణించాలని సూచించారు. సోషల్ మీడియాకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ వహించాలని తెలిపారు. […]
The post ఘనంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవం appeared first on Navatelangana.














