
త్రిస్సూర్: కేరళలో భారీ పేలుడు జరిగింది. త్రిస్సూర్‌లో బాణసంచా నిల్వ, తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. త్రిస్సూర్ పూరం ఉత్సవాల్లో భాగంగా జరిగే తిరువంబడి కోసం బాణసంచా సామగ్రిని సిద్ధం చేస్తున్న కేంద్రంలో మంగళవారం ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక, సహాయక బృందాలు, అంబులెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని త్రిస్సూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.
భారీ పేలుడుతో..దాని శబ్దం చాలా కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. దీంతో సమీపంలోని నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంపం సంభవించినట్లు అనుకుని భయపడినట్లు స్థానికులు తెలిపారు. దట్టమైన పొగ, మంటలు ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు.













