దేశానికే ఆదర్శంగా రాష్ట్ర జొన్న కొనుగోలు విధానం నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన శాఖ పరిధిలోని పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాసంగి 2025, -26 సీజన్‌లో దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రా ష్ట్ర ప్రభుత్వం జొన్న రైతుల నుంచి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)తో రికార్డు స్థాయిలో జొన్నలను కొనుగోలు చేసిందని తె లిపారు. ఈ కొనుగోళ్లకు సంబంధించిన రూ.994 కోట్లను 1,01,376 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చే స్తున్నట్లు వెల్లడించారు. మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యతతో కొనుగోళ్లు చేపట్టిందని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధృడ సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జొన్నల కొనుగోలు చేపట్టినట్లు తెలిపారు.

రైతాంగానికి సాగు నుంచి విక్రయం వరకు సంపూర్ణ భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు ఎరువుల పంపిణీలో మరింత పారదర్శకత, సమర్థత, సులభతరం కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) వ్యవస్థను రాష్ట్రంలో దశలవారీగా విస్తరిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటికే పైలట్‌గా అమలులో ఉన్న జిల్లాలతో పాటు, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాలలో ఎఫ్‌ఎఫ్‌ఎస్ అమలు చేస్తున్నట్టు వివరించా రు. ఈ నేపథ్యంలో సంబంధిత జిల్లాల వ్యవసాయ అధికారులు, ఎరువుల హోల్‌సేల్, రిటైల్ డీలర్లకు ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని, క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారులను మంత్రి ఆదేశించారు.

ఆయిల్ పామ్ విస్తరణ వేగవంతం చేయాలి

రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన ల క్ష్యాలను చేరుకునేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సా గాలని మంత్రి సూచించారు. రైతులు కోరిన వెంటనే ఆయిల్ పామ్ మొక్కలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆగస్టు నెలలో మొక్కల కొరత తలెత్తే అవకాశం ఉన్న కంపెనీలు ముందస్తుగానే ఇతర కంపెనీల నుంచి మిగులు మొక్కలను కొనుగోలు చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో రైతులకు ఆయిల్ పామ్ సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని, పరిపాలనా అనుమతులు వేగంగా మంజూరు చేయడంతో పాటు డ్రిప్ వ్యవస్థ ఏర్పాటులో ఎలాంటి జాప్యం లేకుండా డ్రిప్ కంపెనీలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

హ్యాండ్లూమ్ హ్యకథాన్-2026 జాతీయ విజేతకు మంత్రి అభినందనలు

హ్యాండ్లూమ్ హ్యకథాన్-2026లో జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బా పూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టి) మూడో సంవత్సరం విద్యార్థి వగ్గు శ్రీరామ్‌ను మంత్రి సన్మానించారు. వగ్గు శ్రీరామ్ రూపొందించిన ఎర్గోనామిక్ బ్యాక్ సపోర్ట్ సిస్టమ్ పేరుతో రూపొందించిన ప్రత్యే క కుర్చీ (ప్రోటో టైప్) హ్యాండ్లూమ్ హ్యకథాన్-2026లో జాతీ య స్థాయిలో ప్రథమ బహుమతి సాధించడం గర్వకారణమ ని మంత్రి అన్నారు. మగ్గం గుంటలో గంటల తరబడి పనిచే సే నేతన్నలు వెన్నునొప్పి, ఇతర శారీరక ఇబ్బందులు లేకుం డా సౌకర్యవంతంగా పనిచేసేందుకు ఈ ఆవిష్కరణ ఎంతో ఉపయోగపడుతుందని అభినందించారు. హ్యాండ్లూమ్ రం గంలో వినూత్న ఆవిష్కరణలకు యువత ముందుకు రావడం శుభపరిణామమని, ప్రభుత్వం ఇలాంటి ప్రతిభను ఎల్లప్పు డూ ప్రోత్సహిస్తుందని మంత్రి పేర్కొన్నారు.