మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు మరొక ఐఏఎస్ అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సు ల్తానియాను అరెస్ట్ చేసి శుక్రవారం ఉద యం కోర్టులో హాజరుపర్చాలని హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ కోర్టుకు హాజరువతానని ఆయన అండర్ టేకింగ్ ఇస్తే రూ.5వేల వ్యక్తిగత పూచికత్తుపై వి డుదల చేయాలని ధర్మాసనం స్పష్టం చే సింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బో ర్డుకు చెల్లించాల్సిన నిధులపై గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదని ఓ న్యాయవాది ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం విచారించిన ధర్మాసనం సందీప్ సుల్తానియా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో వ్యక్తిగత హాజరుకు ఆదేశించినప్పటికీ కోర్టు కు హాజరుకాకపోవడం, కౌంటర్ దాఖ లు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.