ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ శ్రేణులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా చూడాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని ఓ ఫంకన్‌హాల్ లో బుధవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్ ఫేజ్----2)పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఎస్‌ఐఆర్ సవరణ ప్రక్రియలో జిల్లా కాంగ్రెస్ బీఎల్‌వోలు ఆశించిన స్థాయిలో పనిచేస్తున్నట్లు కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రాష్ట్రంలోనే అత్యధిక సర్పంచి స్థానాలను గెలుచుకున్న ఘనత ఉందని మంత్రి గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అర్హులైన వారి ఓట్లు లేకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.

పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతైతే ప్రభుత్వాలే తారుమారయ్యే పరిస్థితులు వస్తాయని, పశ్చిమ బెంగాల్, బిహార్‌లో చోటుచేసుకున్న పరిణామాల గురించి అందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని ఆమె స్పష్టం చేశారు. బూత్ స్థాయి బీఎల్‌వోలు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. పేర్ల తొలగింపు, సవరణలు, అభ్యంతరాలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన ఓటర్లకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటరు సవరణ కార్యక్రమంలో కాంగ్రెస్ వెనుకబడిందని, ఇకపై ప్రతి కార్యకర్త మరింత బాధ్యతగా పనిచేయాల్సిన