
ప్రభుత్వ పాఠశాలలో పాముకాటుతో విద్యార్థి మృతి చెందాడు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన దంపతులు సంగీత, గుండప్పలకు ముగ్గురు కుమారులు. రెండో కు మారుడు రంజిత్ కుమార్(8) మూడో తరగతి చ దువుతున్నాడు. గురువారం తరగతి గదిలో కిటికీ పక్కన కూర్చున్నాడు. కిటికీలోంచి వచ్చిన నాగుపాము కాటేసింది. ఉపాధ్యాయుడు బాలుడిని జి ల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.








