
ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఆరుగురు దొంగల ముఠా కత్తులతో బీభత్సం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసిం ది. అనకాపల్లి వద్ద ప్రయాణిస్తున్న రైలులో చొరబడిన దుండగులు, ప్రయాణికులను కత్తులతో బెదిరించి రూ. 38 వేల నగదు, మూడు సెల్ ఫోన్లను అపహరించారు. బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ చివరి జనరల్ బోగీలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసు కుంది. తుని స్టేషన్ దాటిన తర్వాత బోగీలోకి దుండగులు ప్రవేశించి నగలు,నగదు అపహరించి అనకాపల్లిలో రైలు దిగి ఉడాయించారు.
తుని నుంచి అనకాపల్లి మధ్య గంట ప్రయాణం సమయంలో ఈ దోపిడీ జరిగిందని పోలీసులు గుర్తించారు. బాధితులైన ఆరుగురు ప్రయాణీకులు ఓడి శాకు చెందినవారుగా పోలీసులు తెలిపారు. నలుగురు దుండగులు దోపిడీలో పాల్గొన్నట్లు తెలిసింది. ఈ దోపిడీపై బాధితులు విశాఖపట్నంలో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉ౮ంది.













