బ్యాంకాక్: థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, కిదాం బి శ్రీకాంత్, లక్షసేన్‌లు శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల విభాగం తొలి రౌం డ్‌లో సింధు 219, 2112 తేడాతో చైనీస్ తైపీకి చెందిన టంగ్ సియోను ఓడించింది. పురుషుల వి భాగంలో అగ్రశ్రేణి షట్లర్ లక్షసేన్ 2116, 2117తో సింగపూర్‌కు చెందిన జాసన్‌పై విజ యం సాధించాడు. మరో పోటీలో శ్రీకాంత్ 2114, 2115తో లో కీన్ (సింగపూర్)ను చిత్తు చేసి ముందంజ వేశాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ శెట్టి జోడీ విజయం సాధించింది.