
వర్షాకాలం మొదలైంది. ఈ కాలంలో రోడ్లపై ఊహకందని ప్రమాదాలు వాహనదారులున్ని వెంటాడుతుంటాయి. ముఖ్యంగా రోడ్లుపై పేరుకున్న నీళ్లు, అందులోని నీటి పొరల కారణంగా వాహనం అదుపుతప్పే ప్రమాదం ఉంది.ఈ రోడ్లపై వాహనదారులకు అప్రమత్తత చాలా అవసరం. గుంతలో బైక్ పడిపోవడంతో ఓ వ్యక్తి తలకు తీవ్రంగా గాయమైంది. ఓ వైపు వర్షం పడుతుండగానే.. భార్యాభర్తలు హెల్మెట్ పెట్టుకోకుండా బైక్‌పై వెళ్తున్నారు. రోడ్డు మలుపు వద్ద గుంతలో బైక్ పడిపోయింది. ఈ ఘటన గుజరాత్‌లోని జునాగఢ్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదై సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు అధికారులు ఈ వీడియోను విడుదల చేశారు. ప్రయాణం ఎంత చిన్నదైనా హెల్మెట్ మాత్రం తప్పనిసరిగా ధరించాలని, ప్రాణ భద్రతే మొదటి ప్రాధాన్యం అని అధికారులు తెలిపారు.













