🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5150 articles

కూలిన ప్ర‌యివేట్ శిక్ష‌ణా విమానం
Older
చట్ట ప్రకారం ఇంట్లో ఎన్ని లక్షల వరకూ క్యాష్ ఉంచుకోవచ్చో తెలుసా..?
Older
బలపరీక్షలో విజయ్ ప్రభుత్వం అద్భుత విజయం
Older
Telangana

బలపరీక్షలో విజయ్ ప్రభుత్వం అద్భుత విజయం

చెన్నై: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన టివికె అధినేత విజయ్ శాసనసభలోనూ తన బలాన్ని నిరూపించుకున్నారు. బుధవారం జరిగిన బలపరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది. బలపరీక్షకు సంబంధించి ఈ ఉధయం విజయ్.. సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై సభలో చర్చ జరిగిన తర్వాత స్పీకర్ ఓటింగ్ చేపట్టారు. ఇది కాస్త ఆసక్తికరంగా సాగింది. సాధారణ ఓటింగ్ మాదిరిగా కాకుండా.. ఒక్కో సభ్యుడి పేరును పిలుస్తూ ఎమ్మెల్యేల సమ్మతిని అడిగి నమోదు చేసుకున్నారు. ఇందులో విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. 22 మంది సభ్యులు వ్యతిరేకించారు. బలపరీక్ష సమయంలో డిఎంకె సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. టివికె ప్రభుత్వానికి కాంగ్రెస్, విసికె, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతిచ్చాయి. అన్నాడిఎంకె రెబల్ ఎమ్మెల్యేలు కూడా సిఎంకు అనుకూలంగా ఓటేశారు.

గోల్డ్ దిగుమ‌తుల‌పై మోడీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం
Older
Telangana

గోల్డ్ దిగుమ‌తుల‌పై మోడీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ప‌శ్చిమాసియా యుద్ధం నెప‌థ్యంలో ప‌సిడి, వెండి ధ‌ర‌లు భ‌గ్గుమంటున్న విష‌యం తెలిసిందే. సామాన్యుల‌కు బంగారం కొనుగోలు భారంగా మారింది. ఈక్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం గోల్డ్ ప్రియుల‌కు భారీ షాకిచ్చింది. విలువైన గోల్డ్, వెండి, ప్లాటినం దిగుమ‌తుల‌పై సుంకాలు పెంచింది. గోల్డ్, సిల్వ‌ర్‌ల‌పై ఏకంగా ఆరు నుంచి 15శాతం విధించారు. అయితే ప్లాటినంపై 15.4నుంచి 6.4శాతానికి త‌గ్గించింది. ఈ త‌ర‌హా సుంకాలు బంగారం, వెండి డోర్, నాణేలు త‌దిత‌ర వాటికి కూడా వ‌ర్తిస్తాయ‌ని పేర్కొంది. అంత‌ర్జాతీయ ప‌రిణమాల […] The post గోల్డ్ దిగుమ‌తుల‌పై మోడీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం appeared first on Navatelangana.

ఎస్ఆర్‌హెచ్‌ కెప్టెన్ కమిన్స్‌కు జరిమానా
Older
శ్రీ చైతన్య బాలిక ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలి: పల్లె మురళి
Older
Telangana

శ్రీ చైతన్య బాలిక ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలి: పల్లె మురళి

నవతెలంగాణ – మియాపూర్ : మాదాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజ్ ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి అయిన తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులను కాలేజీలకు రప్పించి బలవంతంగా ఇంటర్ సెకండియర్ క్లాసులను నిర్వహిస్తున్నారని అఖిల భారత విద్యార్థి ప్రజాతంత్ర సమైక్య రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి ఆరోపించారు. అందులో భాగంగానే ఆ ఒత్తిడి తట్టుకోలేక గత మూడు రోజులుగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ విద్యార్థిని కుటుంబానికి సమాచారం ఇవ్వకపోవడంతో అమ్మాయి మానసిక ఇబ్బందులకు గురై […] The post శ్రీ చైతన్య బాలిక ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలి: పల్లె మురళి appeared first on Navatelangana.

పంజాబ్ కింగ్స్‌పై పుకార్లు.. మండిపడ్డ ప్రీతి జింటా
Older
Telangana

పంజాబ్ కింగ్స్‌పై పుకార్లు.. మండిపడ్డ ప్రీతి జింటా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు ఆ తర్వాత మాత్రం చతికిలపడింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయి ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలను దూరం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు, ఆటగాళ్లపై రకరకాల వార్తలు వచ్చాయి. వారిలో క్రమశిక్షణ, సమన్వయం లోపించిందని.. దీని వల్లే వరుస ఓటములను ఎదురుకోవాల్సి వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. దీంతో పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘‘విమర్శలు, అసత్య ప్రచారం మధ్య చాలా తేడా ఉంటుంది. గేమ్ గురించి ఆరోగ్యకరమైన చర్చను మేం స్వాగతిస్తాం. కానీ, ఉద్దేశపూర్వకంగా అసత్య కథనాలను వ్యాప్తి చేస్తూ.. మా ఆటగాళ్లు, జట్టు పరువుకు భంగం కలిగిస్తే మాత్రం సహించేది లేదు. నిరాధార సమాచారం విషయంలో మీడియా అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్న’’ అంటూ ప్రీతి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

బల పరీక్షలో నెగ్గిన విజయ్‌ ప్రభుత్వం
Older
సోనియా గాంధీకి అస్వస్థత
Older
పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి ప్రమాణ స్వీకారం
Older
అనుమానస్సదంగా మాజీ సిఎం కుమారుడి మృతి
Older
కునో నేషనల్ పార్క్‌లో నాలుగు చీతా కూనల మృతి
Older
నేపాలీ గ్యాంగ్ హల్‌చల్.. ప్రొఫెసర్ ఇంట్లో భారీ దోపిడీ
Older
Telangana

నేపాలీ గ్యాంగ్ హల్‌చల్.. ప్రొఫెసర్ ఇంట్లో భారీ దోపిడీ

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో నేపాలీ గ్యాంగ్ మరోసారి దోపిడీకి పాల్పడింది. తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూరు గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ ఇంట్లో నేపాలీ ముఠా చోరికి పాల్పడింది. కొద్దిరోజుల క్రితం ప్రొఫెసర్ ఇంట్లో పనికి చేరిన నేపాలీ జంట, పుట్టినరోజు వేడుకల నెపంతో ముఠా సభ్యులను పిలిపించింది. అనంతరం దంపతులపై దాడి చేసి వారి చేతులు కట్టేశారు. మత్తు మందు ఇచ్చి నగలు, విలువైన వస్తువులతో పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు […] The post నేపాలీ గ్యాంగ్ హల్‌చల్.. ప్రొఫెసర్ ఇంట్లో భారీ దోపిడీ appeared first on Navatelangana.

పొదుపు కోసం మోడీ కీలక నిర్ణయం.. కాన్వాయ్‌లో సగం కట్
Older
Telangana

పొదుపు కోసం మోడీ కీలక నిర్ణయం.. కాన్వాయ్‌లో సగం కట్

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన కాన్వాయ్‌లో సగం వాహనాలను తొలగించాలని మోడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధనం ఆదా చేయాలని మోడీ ప్రజలకు సూచించిన విషయం తెలిసిందే. ఈ పనిని తనతోనే మొదలు పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నారట. ఈ నేపథ్యంలోనే తన కాన్వాయ్‌ని సగానికి కుదించాలనే ఆలోచన చేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతేకాక.. కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల(EV) వినియోగాన్ని పెంచాలని మోదీ ఆదేశించారట. కానీ, అందుకోసం కొత్త వాహనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని సూచించారు. భద్రతా ప్రోటోకాల్స్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూనే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) ఈ ఆదేశాలను అమలు చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది.

హామీల అమలే దళపతికి సవాలు
Older
Telangana

హామీల అమలే దళపతికి సవాలు

మెజారిటీకి పది సీట్ల దూరంలో ఆగిపోయిన టివికె దళపతి విజయ్ చివరకు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు. పార్టీ పెట్టిన రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఇంతటి విజయాన్ని కైవసం చేసుకోవడం ఆషామాషీ కాదు. డ్బ్భై ఏళ్ల నుండి పాలకుల వయసు యాభై, అరవైలకు దిగిరావడం దేశానికి ఓ మంచి పరిణామం. యువ రక్తపు ఆలోచనల్లో, పాలనలో, నిర్ణయాల్లో ఆధునికత, వేగం ఉంటాయి. కొంగ్రొత్త విధానాలకు పాలనలో చోటు లభిస్తుంది. నేటి తరం గద్దెనెక్కితే పాత వాసనలు పోయి.. ప్రభుత్వంపై, ప్రజలపై అనవసరపు భారాలు తగ్గి నూతన ఆర్థిక, సామాజిక విధి విధానాలతో కొత్త పుంతలు తొక్కాలి. వయసు మీరిన నేతల పాలనను మారిపోయి రాష్ట్ర ఆర్థిక పుష్టి పెరిగేలా.. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడేలా పథక రచనలు ఉండాలి. అయితే టివికె దళపతి విజయ్ తమిళ నేలపై సరికొత్త మార్పును అందించే విత్తనాలనేమీ చల్లలేదు. అందరి మాదిరే అలవి కానీ జనాకర్షక హామీల బాటలోనే విజయ్ నడిచారు. నటుడైన ఆయనకు ఎన్నికల్లో యువత తోడుంటే.. పెంచిన, కొత్త ధన సహాయ పథకాలకు కుటుంబాలు మద్దతునిచ్చాయి. ఫిబ్రవరి 2024 లో పార్టీ ఆరంభించిన ఆయన తొలి సభకు 8 లక్షల మంది వచ్చారని అంచనా. ఎన్నడూ

భారత్ పయనం స్వేచ్ఛ వైపేనా?
Older
Telangana

భారత్ పయనం స్వేచ్ఛ వైపేనా?

నేటి భారతదేశ రాజకీయ ముఖచిత్రం ఒక క్లిష్టమైన సంధి కాలంలో ఉంది. దశాబ్దాల పాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన దేశం, నేడు ‘ఒకే దేశం -ఒకే సంస్కృతి’ అనే నినాదం వెనుక తన వైవిధ్యాన్ని కోల్పోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం మతాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకుని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చరిత్ర పుటలను తిరగేస్తే, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పాలకులు అనుసరించే మార్గాలు కాలంతోపాటు మారుతుంటాయి. 16వ శతాబ్దంలో ఇటలీకి చెందిన రాజనీతి తత్వవేత్త నికోలో మాఖియావెలి తన ప్రసిద్ధ గ్రంథం ‘ది ప్రిన్స్’ (The Prince) ద్వారా రాజకీయాలను మతం, నైతికత నుండి వేరు చేసి, ‘రాజకీయ లౌకిక వాదానికి’ పునాది వేశారు. కానీ, నేటి భారతదేశంలో నరేంద్ర మోడీ హయాంలో రాజకీయాలు మళ్లీ మతంతో ముడిపడి, ఒక విలక్షణమైన మలుపు తిరుగుతున్నాయి. ఈ పరిణామం రాజ్యాంగ వ్యవస్థల పతనం వైపు దారి తీస్తోందా? భారతీయులను ఆధునిక యుగం నుండి మధ్య యుగపు ఆలోచనా ధోరణిలోకి నెడుతోందా? అన్నది నేడు మేధావుల ముందున్న ప్రధాన ప్రశ్న. మాఖియావెలి కంటే ముందు, పాలన అనేది దైవ కార్యంగా భావించబడేది. మాఖియావెలి దానిని తలకి

తగ్గుతున్న భూసారం.. ముంచుకొస్తున్న ఉపద్రవం
Older
Telangana

తగ్గుతున్న భూసారం.. ముంచుకొస్తున్న ఉపద్రవం

మన కాళ్ళ కింద నిశ్శబ్దంగా ఒక భారీ పర్యావరణ సంక్షోభం పెరుగుతోంది. భూమి చర్మంగా పిలువబడే నేల, వాతావరణ మార్పులు, అధిక రసాయన ఆధారిత వ్యవసాయం, అటవీ వినాశనం, భూమి అధిక వినియోగం, అనారోగ్యకరమైన వ్యవసాయ పద్ధతుల కారణంగా వేగంగా క్షీణిస్తోంది. సారవంతమైన భూమికి ప్రాణాధారమైన మట్టిలోని సేంద్రియ కార్బన్ తగ్గిపోవడం ఆహారభద్రత, జీవవైవిధ్యం, నీటివ్యవస్థ, ప్రపంచ వాతావరణ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పుగా మారిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నేల అనేది కేవలం మట్టి కాదు. ఇది జీవంతో నిండిన ఒక సంక్లిష్ట పర్యావరణ వ్యవస్థ. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో 95% కంటే ఎక్కువ భాగం నేలపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా భూమిపై ఉన్న జీవవైవిధ్యం లో దాదాపు మూడింట రెండొంతుల ఇది నివాసంగా ఉంటుంది. ప్రపంచ అంచనాల ప్రకారం, మంచు లేని భూభాగంలో దాదాపు మూడో వంతు ఇప్పటికే మానవ చర్యల వల్ల క్షీణించింది. వాతావరణ మార్పు, జీవవైవిధ్య నష్టం, నీటి కొరతతోపాటు నేల క్షీణతను కూడా ఒక ప్రధాన ప్రపంచ సంక్షోభంగా పరిగణించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. నేల క్షీణత, వాతావరణ మార్పు ఒకదానితో మరొకటి బలంగా అనుసంధానమై ఉన్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థ

కమలనాథులకు తగునా ఇది!
Older
Telangana

కమలనాథులకు తగునా ఇది!

పశ్చిమబెంగాల్ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నవారికి కమలనాథుల గెలుపు అంతగా ఆశ్చర్యం కలిగించి ఉండదు. మూడు దఫాలుగా అధికారాన్ని నిరాఘాటంగా కొనసాగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీపట్ల సహజంగానే ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒంటెత్తు పోకడలు, స్వయంకృతాపరాధాలు, రాష్ట్రంలో కొరవడిన శాంతిభద్రతలు వంటి లోటుపాట్లను తనకు అనుకూలంగా మలచుకోవడంలో భారతీయ జనతా పార్టీ నూటికి నూరుపాళ్లూ విజయం సాధించింది. ఒక్కమాటలో చెప్పాలంటే తృణమూల్ లోపాలే బిజెపి గెలుపునకు బాటలు వేశాయంటే అతిశయోక్తి కాదు. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బిజెపి వచ్చీరాగానే ప్రజల మన్ననలను చూరగొనేందుకు, రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతిభద్రతలను తిరిగి పట్టాలు ఎక్కించేందుకు శ్రీకారం చుడితే బాగుండేది. కానీ తొలి మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను బట్టి చూస్తే, కమలనాథులకు స్వీయ ఎజెండా అమలే అన్నింటికన్నా ముఖ్యమైనదిగా తోస్తున్నది. బంగ్లాదేశ్ సరిహద్దులలో కంచె నిర్మాణానికి సరిహద్దు భద్రతా దళానికి భూమిని అప్పగించడం, ఆయుష్మాన్ భారత్ సహా ప్రధాన కేంద్ర పథకాలను పశ్చిమ బెంగాల్ లోనూ అమలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లకు

కెనడాలో కాల్పులు... ఇద్దరు భారతీయ యువకులు మృతి
Older
ఆర్టీసీ విలీనంపై జూన్ 2న ప్రకటన!
Older
డిజిటల్గా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు..పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశంలో కేసీఆర్ ఆదేశాలు
Older
డెలివరీ సిబ్బందికి ఆరోగ్య బీమాను అందిస్తున్న అమెజాన్
Older
Telangana

డెలివరీ సిబ్బందికి ఆరోగ్య బీమాను అందిస్తున్న అమెజాన్

నవతెలంగాణ – హైదరాబాద్ :భారతదేశ వ్యాప్తంగా ఉన్న తమ ఆపరేషన్స్ నెట్‌వర్క్‌లోని దాదాపు 90,000 మంది డెలివరీ సిబ్బందికి ఆరోగ్య, బీమా ప్రయోజనాలను విస్తరిస్తున్నట్లు అమేజాన్ ఇండియా ఈరోజు ప్రకటించింది. ఈ ప్రయోజనాల ద్వారా సాధారణ వైద్య ఖర్చుల కోసం ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ కవరేజీ, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందుతుంది. లాస్ట్-మైల్ డెలివరీ విభాగాల్లో పనిచేసే సిబ్బంది అందరికీ వర్తించే ఈ సదుపాయం కింద.. మెడిక్లెయిమ్ కవరేజీని రూ. 1.5 […] The post డెలివరీ సిబ్బందికి ఆరోగ్య బీమాను అందిస్తున్న అమెజాన్ appeared first on Navatelangana.

‘దొడ్డు రకం’ అమ్ముకునేందుకు రైతుల అరిగోస..వడ్ల అన్లోడింగ్‌‌‌‌కు బాయిల్డ్‌‌‌‌ మిల్లర్ల ‌‌కిరికిరి
Older
Advertisement
Sponsored by ATA – American Telugu Association