
5150 articles

హైదరాబాద్: అబద్దాలను ప్రచారం చేయడం మానుకోవాలని నటి మౌనీరాయ్ తెలిపారు. తన భర్త సూరజ్ నంబియార్ తో తాను విడిపోతున్నట్టు వస్తున్న వార్తలపై ఆమె ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొద్దని కోరారు. 2022లో నంబియార్ ను మౌనీరాయ్ పెళ్లి చేసుకుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో కావడంతో ఇద్దరు విడిపోతున్నారని నెటిజన్లు కామెంట్ల చేయడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. గత కొంత కాలం నుంచి భర్తతో కలిసి ఉన్న ఫొటోలను కూడా ఆమె పోస్టు చేయలేదు. ఇన్ స్టాలో వివాహానికి సంబంధించిన ఫొటోలు లేకపోవడంతో ఈ న్యూస్ వైరల్ గా మారినట్టు సమాచారం. మౌనీరాయ్ తన ఇన్ స్టా అకౌంట్ డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. కెజిఎఫ్ చాప్టర్ 1, వేదా(హిందీ), గోల్డ్, బ్రహ్మాస్త్ర సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. బుల్లితెరలో నాగిని సీరియల్ లో కూడా నటించారు.



హైదరాబాద్: మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో విజయ్ రెండో స్థానంలో ఉన్నారు. ఐఎండిబి అనే సంస్థ పాపులర్ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తొలి స్థానంలో నటుడు, దర్శకుడు అంబరీష్ వర్మ ఉండగా రెండో స్థానంలో విజయ్, ఏడో స్థానంలో హీరోయిన్ సాయి పల్లవి ఉన్నారు. వారం రోజుల క్రితం విజయ్ 21వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. అంబరీష్ దర్శకత్వం వహించిన సప్నే వర్సెస్ ఏవ్రీవన్ సీజన్: 2 సిరీస్ అమెజాన్ ఫ్రైమ్ లో అందుబాటులో రావడంతో ఆయనన తొలి స్థానం దక్కించుకున్నాడు. విజయ్ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించడంతో పాటు సిఎం కావడంతో ఆయన రెండో స్థానంలో ఉన్నాడు. ఏక్ దిన్ అనే సినిమాలో జునైద్ తో కలిసి నటించడంతో సాయి పల్లివి ఏడో స్థానానికి చేరుకుంది.

పాకిస్థాన్ మహిళల టి-20 జట్టు చరిత్ర సృష్టించింది. పరుగుల పరంగా తమ అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసింది. జింబాబ్వేతో మంగళవారం (మే 12) జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 153 పరుగుల తేడాతో గెలిచి సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. దీంతో పాక్ మహిళల జట్టు అంతర్జాతీయ స్థాయిలో 200 పరుగుల మార్క్ తాకడం ఇదే తొలిసారి. ముఖ్యంగా అయేషా జాఫర్ 47 బంతుల్లోనే 15 ఫోర్లు, 2 సిక్సులతో 102 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. మహిళల అంతర్జాతీయ టి-20 క్రికెట్‌లో మూడో అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా ఆయేషా రికార్డు సాధించింది. అంతేకాక.. పాకిస్థాన్ తరఫున మునీబా అలీ తర్వాత టి-20ల్లో సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా ఆయేషా జాఫర్ నిలిచింది. ఇక లక్ష్య చేధనలో జింబాబ్వే పూర్తిగా చేతులెత్తేసింది. 18.2 ఓవర్లలో కేవలం 84 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. పాక్ బౌలింగ్‌లో కెప్టెన్ ఫాతిమా 3, సదియా ఇక్బాల్, నతాలియా పర్వేజ్ చెరి రెండు, రమీన్ షమీమ్ ఒక వికెట్ తీశారు. ఫలితంగా మూడు టి-20ల సిరీస్‌లో పాక్ బోణీకొట్టింది. అంతకు ముందు జరిగిన మూడు వన్డేల



ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా.. ఈ ఏడాది జూన్‌లో మహిళల టి-20 వరల్డ్ జరుగనుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. ఈసారి ట్రోఫీ దక్కించుకొనేందుకు అన్ని జట్లు వ్యూహాలను రచిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ ప్లేయర్ సోఫీ మోలినెక్స్ సారథ్యం వహిస్తుండగా.. వైస్ కెప్టెన్‌గా ఆష్లే గార్డ్‌నర్ వ్యవహరించనుంది. ఈ జట్టులో ఎల్లిస్ పెర్రీ, బెత్ మూనీ, తహియా మెక్‌గ్రాత్ వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కింది. ముఖ్యంగా ఈసారి సెలెక్టర్లు స్పిన్ బౌలర్లకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇంగ్లండ్ పరిస్థితులకు అనుగుణంగా జార్జియా వేర్హమ్, అలానా కింగ్ వంటి లెగ్ స్పిన్నర్లను ఎంపిక చేశారు. అయితే ఫాస్ట్ బౌలర్ డార్సీ బ్రౌన్‌కు చోటు దక్కకపోవడం అభిమానుల్ని కాస్త నిరాశపరిచింది. ఆమె స్థానంలో 20 ఏళ్ల యువ లెఫ్ట్ ఆర్మ్ సీయర్ లూసి హ్యామిల్టన్‌కు అవకాశం దక్కింది. టి-20 ప్రపంచకప్‌కి ఆసీస్ జట్టుసోఫీ మోలినెక్స్ (కెప్టెన్), ఆష్లే గార్డ్‌నర్ (వైస్ కెప్టెన్), తహియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), నికోలా క్యారీ, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, గ్రేస్

లక్నో: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యుపి మాజీ సిఎం ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. బుధవారం ఉదయం ప్రతీక్ అపస్మారక స్థితిలో వెళ్లడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ప్రతీక్ కొన్ని సంవత్సరాల నుంచి ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బందిపడుతుండడంతో చికిత్స తీసుకున్నాడు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన శరీరంపై గాయాలు లేవని ప్రాథమిక నివేదికలో తెలిసింది. తన సోదరుడు మృతిపట్ల యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్, రాజకీయ ప్రముఖులు, తదితరలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసు నుంచే ఆయన ఆరోగ్యం ఎంతో శ్రద్ధ వహించేవారని అఖిలేష్ గుర్తు చేశారు. రెండు నెలల క్రితం ప్రతీక్ ను కలిసినప్పుడు రాజకీయాలతో వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుకున్నామని ఆయన తెలిపారు. మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్ కు సవతి తల్లి సోదరుడు ప్రతీక్. 2011లో అపర్ణను ప్రతీక్ వివాహం చేసుకున్నాడు. 2017 అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ తరపున అ


నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రాజన్ పండిట్‌ను ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’ (OSD)గా నియమించుకోవడంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. తాజాగా ఈ అంశంపై టీవీకే ప్రభుత్వం స్పందించింది. రాజన్ పండిట్‌ను OSD నియమాకాన్ని రద్దు చేసింది. కాగా, విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ అసెంబ్లీ వేదికగా తీవ్రంగా ఖండించారు. జ్యోతిష్యుడికి అధికారిక పదవి కట్టబెట్టడంపై ఆమె మండిపడుతూ, […] The post ఓఎస్‌డీగా జ్యోతిష్యుడు..నియామకం రద్దు appeared first on Navatelangana.




సూపర్‌స్టార్ మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ హీరో పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగపురం’. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ భామ రషా తడాని హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటని విడుదల చేశారు. ‘మంగ.. మంగ’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. రేవంత్ ఆలపించారు. ఇక సినిమా విషయానికొస్తే.. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకి జివి ప్రకాశ్ సంగీతం అందించాడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అశ్వినీదత్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాని పి కిరణ్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

బెంగళూరు: కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్(47) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం వేకువజామున దిలీప్ రాజ్ కు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించామని అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఆయన మృతితో కన్నడ సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు పేర్కొన్నారు. మిలానా చిత్రంతో ఆయన సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. యూ టర్న్ సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించారు. నటుడిగా సినిమాలు తీస్తూనే నిర్మాతగా కూడా వ్యవహరించారు. డిఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై బుల్లితెర సీరియళ్లను నిర్మించి పేరు తెచ్చుకున్నారు. పలు సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా వర్క్ చేశారు.

నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రాజన్ పండిట్‌ను ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’ (OSD)గా నియమించుకోవడంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ అసెంబ్లీ వేదికగా తీవ్రంగా ఖండించారు. జ్యోతిష్యుడికి అధికారిక పదవి కట్టబెట్టడంపై ఆమె మండిపడుతూ, రాజన్ పండిట్ విజయ్‌కు వ్యక్తిగత గురువు అయితే ఆయనను సొంత పనులకే పరిమితం చేసుకోవాలని, ప్రభుత్వ వ్యవస్థలోకి […] The post సీఎం విజయ్ ఓఎస్‌డీగా జ్యోతిష్యుడు..విమర్శల వెల్లువ appeared first on Navatelangana.


మహారాష్ట్ర పుణే జిల్లాలోని బారామతిలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. శిక్షణకు ఉపయోగించే విమానం బుధవారం కూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.పుణె పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘రెడ్‌బర్డ్’ విమానయాన సంస్థకు చెందిన విమానం శిక్షణ సమయంలో.. సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ఉదయం 8.50 గంటల సమయంలో బారామతి విమానాశ్రయానికి ఆనుకొని ఉన్న గోజుబావి గ్రామం సమీపంలో క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ల్యాండింగ్‌కి ముందు విమానంలో కొంత భాగం ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో విమానంలో శిక్షణ తీసుకుంటున్న పైలట్ మాత్రమే ఉన్నాడు. దీంతో అతడు గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి గల సాంకేతిక లోపంపై కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.
