
5133 articles

ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వివో తన కొత్త 5G ఫోన్‌ను లాంచ్ చేసింది. కంపెనీ చైనాలో ఈ పరికరాన్ని 'వివో Y60' పేరిట సైలెంట్ గా విడుదల చేసింది. వివో ఇప్పటికే మార్కెట్లో వివో Y600 ప్రోను విడుదల చేయగా, తాజాగా ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. మూడు రంగులు, మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ పరికరం ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వివో Y60 ధర, లభ్యత ధర విషయానికి వస్తే, 6GB + 128GB స్టోరేజ్‌తో కూడిన బేస్ వేరియంట్ ధర CNY 1,799 (సుమారుగా రూ. 25,000). అలాగే 6GB + 256GB వేరియంట్ ధర CNY 1,999 (సుమారుగా రూ. 28,000). ఈ ఫోన్ 8GB + 256GB వేరియంట్ ధర CNY 2,299 (సుమారుగా రూ. 32,000). వివో Y60 ఫీచర్లుఈ వివో ఫోన్‌లో 6.74-అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్‌కు 4nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ శక్తిని అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS 6 పై పనిచేస్తుంది. ఇందులో అడ్రినో 613 GPU, 8GB వరకు LPDDR4x RAM, 256
నవతెలంగాణ – ఆర్మూర్ఆలూరు మండలంలోనిమచ్చర్ల గ్రామంలో లక్మి బాలాగౌడ్ ,తలారి బుచ్చమ్మ గంగారం,ప్రమీల శాంసన్ దంపతులఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం బుధవారం నిర్వహించినారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు దంపతులకు నూతన వస్త్రాలు బహుకరించినారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి ని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు చాలువతో సత్కరించినారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు జితేందర్ , మాజీ ఎం పి టి సి సంజీవ్ డైరెక్టర్ […] The post మచ్చర్లలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం appeared first on Navatelangana.
నవతెలంగాణ-ఆర్మూర్పట్టణంలోని డ్రీమ్ స్టడీ సర్కిల్ ఎందు శిక్షణ పొందిన సైదు అయాన్ సైనిక స్కూల్ కు ఎంపికైనట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ అజ్మత్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి రుక్మాపూర్ నందు గల సైనిక్ స్కూల్ కు ఎంపిక కాగా, రాష్ట్ర స్థాయిలో 19వ ర్యాంక్ సాధించడం జరిగిందని తెలిపారు. మోడల్ స్కూల్ ఎంట్రన్స్ టెస్టులో స్టేట్ ర్యాంక్ 19వ , ఎస్సీ కేటగిరి నందు డిస్ట్రిక్ట్ 1వ ర్యాంక్ సాధించినట్టు,స్టడీ సర్కిల్ బృందం అభినందించారు. The post సైనిక్ స్కూల్ కు సైదు అయాన్ ఎంపిక appeared first on Navatelangana.


ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్‌మీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 16T 5G విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. మే 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో విడుదల కానుందని రియల్‌మీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Realme.comలో ప్రకటించింది. విడుదలకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన అనేక కీలక ఫీచర్లు వెల్లడయ్యాయి. వాటిలో దీని భారీ 8000mAh బ్యాటరీ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ ఫోన్ స్టార్‌లైట్ బ్లాక్, స్టార్‌లైట్ రెడ్, బ్లూ రంగులలో లభిస్తుందని కూడా కంపెనీ ధృవీకరించింది. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. కంపెనీ ఇప్పటికే రియల్‌మీ 16, రియల్‌మీ 16 ప్రో, రియల్‌మీ 16 ప్రో ప్లస్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే! ఒకవేళ ఈ పరికరాన్ని లాంచ్ చేస్తే ఇది రియల్‌మీ 16 సిరీస్‌లో నాల్గవ మోడల్ అవుతుంది. విడుదలకు ముందు కంపెనీ ఈ ఫోన్ కోసం ఒక మైక్రోసైట్‌ను కూడా లైవ్‌స్ట్రీమ్ చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఫీచర్లు వెల్లడిస్తారని ఇది సూచిస్తోంది. రియల్‌మీ 16T 5G అతిపెద్ద ఆకర్షణ దాని 8000mAh టైటాన్ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే



హైదరాబాద్: అబద్దాలను ప్రచారం చేయడం మానుకోవాలని నటి మౌనీరాయ్ తెలిపారు. తన భర్త సూరజ్ నంబియార్ తో తాను విడిపోతున్నట్టు వస్తున్న వార్తలపై ఆమె ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొద్దని కోరారు. 2022లో నంబియార్ ను మౌనీరాయ్ పెళ్లి చేసుకుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో కావడంతో ఇద్దరు విడిపోతున్నారని నెటిజన్లు కామెంట్ల చేయడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. గత కొంత కాలం నుంచి భర్తతో కలిసి ఉన్న ఫొటోలను కూడా ఆమె పోస్టు చేయలేదు. ఇన్ స్టాలో వివాహానికి సంబంధించిన ఫొటోలు లేకపోవడంతో ఈ న్యూస్ వైరల్ గా మారినట్టు సమాచారం. మౌనీరాయ్ తన ఇన్ స్టా అకౌంట్ డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. కెజిఎఫ్ చాప్టర్ 1, వేదా(హిందీ), గోల్డ్, బ్రహ్మాస్త్ర సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. బుల్లితెరలో నాగిని సీరియల్ లో కూడా నటించారు.



హైదరాబాద్: మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో విజయ్ రెండో స్థానంలో ఉన్నారు. ఐఎండిబి అనే సంస్థ పాపులర్ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తొలి స్థానంలో నటుడు, దర్శకుడు అంబరీష్ వర్మ ఉండగా రెండో స్థానంలో విజయ్, ఏడో స్థానంలో హీరోయిన్ సాయి పల్లవి ఉన్నారు. వారం రోజుల క్రితం విజయ్ 21వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. అంబరీష్ దర్శకత్వం వహించిన సప్నే వర్సెస్ ఏవ్రీవన్ సీజన్: 2 సిరీస్ అమెజాన్ ఫ్రైమ్ లో అందుబాటులో రావడంతో ఆయనన తొలి స్థానం దక్కించుకున్నాడు. విజయ్ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించడంతో పాటు సిఎం కావడంతో ఆయన రెండో స్థానంలో ఉన్నాడు. ఏక్ దిన్ అనే సినిమాలో జునైద్ తో కలిసి నటించడంతో సాయి పల్లివి ఏడో స్థానానికి చేరుకుంది.

పాకిస్థాన్ మహిళల టి-20 జట్టు చరిత్ర సృష్టించింది. పరుగుల పరంగా తమ అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసింది. జింబాబ్వేతో మంగళవారం (మే 12) జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 153 పరుగుల తేడాతో గెలిచి సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. దీంతో పాక్ మహిళల జట్టు అంతర్జాతీయ స్థాయిలో 200 పరుగుల మార్క్ తాకడం ఇదే తొలిసారి. ముఖ్యంగా అయేషా జాఫర్ 47 బంతుల్లోనే 15 ఫోర్లు, 2 సిక్సులతో 102 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. మహిళల అంతర్జాతీయ టి-20 క్రికెట్‌లో మూడో అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా ఆయేషా రికార్డు సాధించింది. అంతేకాక.. పాకిస్థాన్ తరఫున మునీబా అలీ తర్వాత టి-20ల్లో సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా ఆయేషా జాఫర్ నిలిచింది. ఇక లక్ష్య చేధనలో జింబాబ్వే పూర్తిగా చేతులెత్తేసింది. 18.2 ఓవర్లలో కేవలం 84 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. పాక్ బౌలింగ్‌లో కెప్టెన్ ఫాతిమా 3, సదియా ఇక్బాల్, నతాలియా పర్వేజ్ చెరి రెండు, రమీన్ షమీమ్ ఒక వికెట్ తీశారు. ఫలితంగా మూడు టి-20ల సిరీస్‌లో పాక్ బోణీకొట్టింది. అంతకు ముందు జరిగిన మూడు వన్డేల



ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా.. ఈ ఏడాది జూన్‌లో మహిళల టి-20 వరల్డ్ జరుగనుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. ఈసారి ట్రోఫీ దక్కించుకొనేందుకు అన్ని జట్లు వ్యూహాలను రచిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ ప్లేయర్ సోఫీ మోలినెక్స్ సారథ్యం వహిస్తుండగా.. వైస్ కెప్టెన్‌గా ఆష్లే గార్డ్‌నర్ వ్యవహరించనుంది. ఈ జట్టులో ఎల్లిస్ పెర్రీ, బెత్ మూనీ, తహియా మెక్‌గ్రాత్ వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కింది. ముఖ్యంగా ఈసారి సెలెక్టర్లు స్పిన్ బౌలర్లకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇంగ్లండ్ పరిస్థితులకు అనుగుణంగా జార్జియా వేర్హమ్, అలానా కింగ్ వంటి లెగ్ స్పిన్నర్లను ఎంపిక చేశారు. అయితే ఫాస్ట్ బౌలర్ డార్సీ బ్రౌన్‌కు చోటు దక్కకపోవడం అభిమానుల్ని కాస్త నిరాశపరిచింది. ఆమె స్థానంలో 20 ఏళ్ల యువ లెఫ్ట్ ఆర్మ్ సీయర్ లూసి హ్యామిల్టన్‌కు అవకాశం దక్కింది. టి-20 ప్రపంచకప్‌కి ఆసీస్ జట్టుసోఫీ మోలినెక్స్ (కెప్టెన్), ఆష్లే గార్డ్‌నర్ (వైస్ కెప్టెన్), తహియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), నికోలా క్యారీ, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, గ్రేస్

లక్నో: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యుపి మాజీ సిఎం ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. బుధవారం ఉదయం ప్రతీక్ అపస్మారక స్థితిలో వెళ్లడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ప్రతీక్ కొన్ని సంవత్సరాల నుంచి ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బందిపడుతుండడంతో చికిత్స తీసుకున్నాడు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన శరీరంపై గాయాలు లేవని ప్రాథమిక నివేదికలో తెలిసింది. తన సోదరుడు మృతిపట్ల యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్, రాజకీయ ప్రముఖులు, తదితరలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసు నుంచే ఆయన ఆరోగ్యం ఎంతో శ్రద్ధ వహించేవారని అఖిలేష్ గుర్తు చేశారు. రెండు నెలల క్రితం ప్రతీక్ ను కలిసినప్పుడు రాజకీయాలతో వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుకున్నామని ఆయన తెలిపారు. మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్ కు సవతి తల్లి సోదరుడు ప్రతీక్. 2011లో అపర్ణను ప్రతీక్ వివాహం చేసుకున్నాడు. 2017 అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ తరపున అ


నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రాజన్ పండిట్‌ను ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’ (OSD)గా నియమించుకోవడంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. తాజాగా ఈ అంశంపై టీవీకే ప్రభుత్వం స్పందించింది. రాజన్ పండిట్‌ను OSD నియమాకాన్ని రద్దు చేసింది. కాగా, విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ అసెంబ్లీ వేదికగా తీవ్రంగా ఖండించారు. జ్యోతిష్యుడికి అధికారిక పదవి కట్టబెట్టడంపై ఆమె మండిపడుతూ, […] The post ఓఎస్‌డీగా జ్యోతిష్యుడు..నియామకం రద్దు appeared first on Navatelangana.


