
5154 articles

నవతెలంగాణ – హైదరాబాద్ :భారతదేశ వ్యాప్తంగా ఉన్న తమ ఆపరేషన్స్ నెట్‌వర్క్‌లోని దాదాపు 90,000 మంది డెలివరీ సిబ్బందికి ఆరోగ్య, బీమా ప్రయోజనాలను విస్తరిస్తున్నట్లు అమేజాన్ ఇండియా ఈరోజు ప్రకటించింది. ఈ ప్రయోజనాల ద్వారా సాధారణ వైద్య ఖర్చుల కోసం ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ కవరేజీ, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందుతుంది. లాస్ట్-మైల్ డెలివరీ విభాగాల్లో పనిచేసే సిబ్బంది అందరికీ వర్తించే ఈ సదుపాయం కింద.. మెడిక్లెయిమ్ కవరేజీని రూ. 1.5 […] The post డెలివరీ సిబ్బందికి ఆరోగ్య బీమాను అందిస్తున్న అమెజాన్ appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : పిల్లల టిఫిన్ బాక్స్ వారి రోజువారీ పోషకాహార పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. ఈ వాస్తవాన్ని ఆధారంగా చేసుకుని,డానోన్ ఇండియా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో, ఐరన్ లోపం మరియు రక్తహీనతపై అవగాహన పెంపు లక్ష్యంగా “ఇండియా కా ఐరన్ అప్ కరేంగే” ప్రచార గీతాన్ని ప్రారంభించింది.ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ సహకారంతో రూపొందించిన ఈ 40 సెకన్ల చిత్రం, పిల్లలను కథనానికి కేంద్రబిందువుగా నిలుపుతుంది. సమతుల్య ఆహారం నుంచి ప్యాకేజ్డ్ స్నాక్స్ […] The post డానోన్ ఇండియా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ‘ఐరన్-గీతం’ను ఆవిష్కరణ appeared first on Navatelangana.


మేడ్చల్: వృద్ధ దంపతులను నేపాలీలు కట్టేసి ఇంట్లో బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌకూరు గోల్ఫ్ ఎన్ క్లేవ్ లో మురళీ ధర్(68) అనే వ్యక్తి ఉద్యోగ విరమణ చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఇంట్లో తన భార్య డాక్టర్ విజయలక్ష్మీతో(58) కలిసి ఉంటున్నాడు. వీళ్ల ఇంట్లో పని చేయడానికి నేపాలీ జంట చేరింది. నమ్మకంగా పని చేస్తూ వారితో కలిసిపోయారు. వారికీ ఓ మహిళ బంధువుగా పరిచయమై ఇంట్లోకి చేరింది. సోమవారం రాత్రి ఓ మహిళ పుట్టిన రోజు ఉండడంతో జన్మదిన వేడుకలు జరుకుంటామని వృద్ధ దంపతులను నమ్మించారు. కేక్ కట్ చేసిన అనంతరం భోజనం చేస్తుండగా నటించి వృద్ధ దంపతులను బెదిరించారు. తమ ప్రాణాలు తీయొద్దని డబ్బులు, నగలు అక్కడ ఉన్నాయని తీసుకోమ్మని వృద్ధ దంపతులు వారికి చెప్పారు. దంపతుల చేతులు కట్టేసి మత్తు మందు పదార్థాలను వారికి ఇవ్వడంతో స్పృహతప్పి పడిపోయారు. వెంటనే నేపాలీ గ్యాంగ్ ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు దొచుకెళ్లారు. మరునాడు మురళీధర్ కిటీకిలో నుంచి స్థానికులను పిలవడంతో వాళ్లు డోర్లను ఓపెన్ చేశారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
నవతెలంగాణ – హైదరాబాద్: అమేజాన్ బజార్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు అత్యంత వేగంగా పెరుగుతున్న రాష్ట్రాలలో ఒకటిగా రూపొందాయని Amazon.in ఈరోజు ప్రకటించింది. రెండు రాష్ట్రాలలో ఆర్డర్లు ఏడాదికి 4 రెట్లు పెరిగాయి, సైన్ అప్ చేసిన కొత్త కస్టమర్లు 4 రెట్లు పెరిగి హైదరాబాద్ ముందు స్థానంలో నిలిచింది. రాష్ట్రాల్లోని విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం మరియు వరంగల్ లు తదుపరి స్థానంలో నిలిచాయి. 2026లో, సంవత్సరం ప్రారంభమైన మొదటి నాలుగు నెలల్లోనే హైదరాబాద్‌లో […] The post తెలంగాణల్లో 4X వృద్ధిని నమోదు చేసిన అమేజాన్ బజార్ appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ మార్కెట్లలో దక్షిణ భారతదేశం ఒకటి. దీంతో.. దక్షిణ భారతదేశానికి కీలకంగా మారిన హైదరాబాద్ లో మోటోహాస్ ఇండియా తన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ప్రారంభించడమే కాదు, ప్రీమియం యూరోపియన్ మొబిలిటీ బ్రాండ్‌లైన బ్రిక్స్‌టన్ మోటార్‌సైకిళ్లు మరియు విఎల్ఎఫ్ స్కూటర్లను తీసుకువచ్చింది. ఈ షోరూమ్, హైదరాబాద్‌లోని మాదాపూర్, మెగా హిల్స్, ప్లాటినం హైట్స్‌లో ఉంది. ఇది 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఐటీ ఉద్యోగులు, […] The post బ్రిక్స్‌టన్ మోటార్ సైకిళ్లు & విఎల్ఎఫ్ స్కూటర్లను ఘనంగా ప్రారంభం appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలను వాడుకుంటున్నారంటూ దాఖలు చేసిన వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన చిత్రాలతో టీ-షర్టులను విక్రయిస్తున్న ఓ వ్యాపారిపై మంగళవారం జస్టిస్ తుషార్ రావు గెడెలా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. విచారణ సందర్భంగా “నాగార్జున ఫోటోలను వాణిజ్యపరంగా వాడుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?” అని సదరు వ్యాపారిని కోర్టు నిలదీసింది. దీనికి వ్యాపారి […] The post నాగార్జున ఫోటోలు టీ-షర్టులు..హైకోర్టు ఆగ్రహం appeared first on Navatelangana.



కామారెడ్డి: సోషల్ మీడియాలో లైక్ లు, వ్యూస్ కోసం వీడియో పోస్టు చేయడంతో అతడి ఇంటికి పోలీసులు వచ్చారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... రెడ్లాన్ రోహిత్ అనే యువకుడు తాను ఆత్మహత్య చేసుకుంటున్నంటూ వీడియో రూపొందించి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రోహిత్ ఇంటికి చేరుకున్నారు. తాను కేవలం వ్యూస్, లైక్ ల కోసమే ఈ వీడియో తీశానని చెప్పాడు. కానీ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.

అహ్మదాబాద్: ఐపిఎల్ లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఎస్ ఆర్ హెచ్ పై జిటి 82 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత గుజరాత్ 169 పరుగుల లక్ష్యాన్ని ఎస్ ఆర్ హెచ్ ముందు ఉంచింది. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులు చేసి ఆలౌటైంది.మ్యాచ్ ఓటమి అనంతరం ప్యాట్ కమ్నీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ జట్టు ఓటమి నిరాశ కలిగించిందని, ఇంకా ప్లే ఆఫ్స్ సాధించడానికి ఇంకా రెండు అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. జిటి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతోనే ఆ జట్టు గెలుపొందిందని ప్యాట్ ప్రశంసించారు. అహ్మదాబాద్ పిచ్ పై లెంగ్త్ బౌల్స్ ప్రధానమైన మూడు వికెట్లు తీయడంతో తన ఓటమి ఖాయమైందన్నారు. ఎస్ఆర్ హెచ్ బౌలర్లు బౌలింగ్ లో లెంగ్త్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ ఐపిఎల్ లో టాప్ 4 బాట్య్స్ మెన్లు నాలుగు వందలకు పైగా పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉన్నారని కొనియాడారు. గత ఏడు మ్యాచ్ లలో ఐదు మ్యాచ్ లు గెలిచామని ప్యాట్ తెలియజేశారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ చిన్నకుమారుడు ప్రతీక్ యాదవ్(38) మృతి చెందారు. అస్వస్థతకు గురైన ప్రతీక్‌ను హుటాహుటిన లఖ్‌నవూ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. The post మాజీ సీఎం కుమారుడు మృతి appeared first on Navatelangana.

తిరుమల: హనుమజ్జయంతి సందర్భంగా మంగళవారం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహం వద్ద వేద మంత్రోచ్చారణలు మేళతాళాల నడుమ టిటిడి ప్రత్యేక పూజలను వేడుకగా నిర్వహించింది. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈఓ లోకనాథం, వీజీవో సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా తిరుమలలో స్థానికంగా ఉన్న పలు హనుమాన్ ఆలయాల్లో కూడా హనుమజ్జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా ఓ ఆలయ ప్రాంగణంలోని గోడ కూలిపోవడంతో ఆరుగురు భక్తులు మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. మంగళవారం జత్ తహసీల్‌లోని మోతేవాడి గ్రామంలో ఉన్న మర్గుదేవి ఆలయంలో ఈ దుర్ఘటన జరిగింది. మర్గుబాయి దేవి వార్షిక జాతర సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షంతో పాటు బలమైన […] The post విషాదం..ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి appeared first on Navatelangana.


