ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అమరావతి నిర్మాణ స్థలాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ప్రభుత్వ భవనాలు, సచివాలయ నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు.

'2027 మార్చి నాటికి ముఖ్యమైన నిర్మాణాలు పూర్తవుతాయి. అమరావతి మన కల, దాన్ని నిజం చేస్తాం' అని సీఎం పేర్కొన్నారు. ఇప్పటివరకు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అధికారులు తెలిపారు.