జాతీయ విద్యా విధానం సంస్కరణలలో భాగంగా సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థుల కోసం మొదటిసారిగా నిర్వహిస్తున్న ఫేజ్-2 బోర్డు పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని పలు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు గణిత పరీక్షను మళ్లీ రాశారు. మొదటి విడతలో మ్యాథ్స్ ప్రశ్నాపత్రం కఠినంగా వచ్చిందని భావించిన విద్యార్థులు ఈసారి మెరుగైన మార్కులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కొత్త రెండు విడతల పరీక్షా విధానం వల్ల అదే విద్యా సంవత్సరంలో మార్కులు మెరుగుపర్చుకునే అవకాశం లభించిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కంపార్ట్మెంట్ సబ్జెక్టులు క్లియర్ చేసుకునేందుకు కూడా ఈ విధానం ఉపయోగపడనుంది. విద్యార్థులు సాధించిన రెండు మార్కుల్లో మెరుగైన స్కోరునే తుది ఫలితంగా పరిగణిస్తామని సీబీఎస్ఈ అధికారులు తెలిపారు.














