ఆంధ్రప్రదేశ్‌లో సింగపూర్ తరహా పరిపాలన అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అమరావతి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలోని ఒక జిల్లాలో సింగపూర్ బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్‌ను అమలు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం 90 రోజుల సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
పార్వతీపురం, అల్లూరి జిల్లాల అభివృద్ధిని ఉదాహరణగా తీసుకున్న చంద్రబాబు… కాఫీ విలువ ఆధారిత ఉత్పత్తుల వల్ల అల్లూరి జిల్లాలో GSDP వృద్ధి మెరుగ్గా ఉందన్నారు. రాష్ట్రంలో అరుదైన ఖనిజ సంపద ఉందని… వాటి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
సూర్యలంక, మంగినపూడి, విశాఖపట్నం, శ్రీకాకుళం, మైపాడు బీచ్ ఫ్రంట్‌ల అభివృద్ధితో తీర ప్రాంత ప్రజలకు భారీగా ఉపాధి అవకాశాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు.














