ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయ అభివృద్ధి పనులకు మొత్తం 832 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ఎండోమెంట్స్ మంత్రి అనం రామ నారాయణ రెడ్డి వెల్లడించారు.
భజన మందిరాల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ.. ఇప్పటికే 679 భజన మందిరాలకు 113 కోట్ల 25 లక్షల రూపాయలు విడుదల చేయగా.. మరో 5 వేల కొత్త భజన మందిరాల నిర్మాణానికి 750 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.
దూప దీప నైవేద్య పథకం కింద రాష్ట్రంలోని 6 వేల 170 ఆలయాలకు ప్రతి నెలా 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. మొత్తం 74 కోట్ల 4 లక్షల రూపాయలను అర్చకుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు.













