ప్రపంచ వాతావరణ సంస్థ, కోపెర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ సంయుక్త నివేదిక యూరప్‌లో ఆందోళనకర పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. 2025లో దాదాపు మొత్తం యూరప్ సాధారణాన్ని మించిన ఉష్ణోగ్రతలను అనుభవించింది. కార్చిచ్చు , పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు, తీవ్ర హీట్‌వేవ్స్ కొత్త రికార్డులు నమోదు చేశాయి.

యూరోపియన్ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ నివేదిక ప్రకారం, కనీసం 95 శాతం యూరప్ అధిక ఉష్ణోగ్రతల ప్రభావాన్ని ఎదుర్కొంది. ఇక కార్చిచ్చు లక్షల హెక్టార్ల భూమిని దహనం చేశాయి. వాతావరణ మార్పులు మరింత తీవ్రమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.









