ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన ఆస్టెరిటీ డ్రైవ్ పిలుపు తర్వాత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కీలక నిర్ణయం తీసుకున్నారు.

మంత్రులు, ఉన్నతాధికారుల కాన్వాయ్‌లలో వెళ్లే వాహనాల సంఖ్యను తక్షణమే 50 శాతం తగ్గించాలని ఆదేశించారు.

ముఖ్య కార్యదర్శి, డీజీపీతో పాటు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం యోగి ఈ నిర్ణయం ప్రకటించారు.

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలు ఇంధనాన్ని పొదుపుగా వినియోగించాలని, అవసరం లేని బంగారం కొనుగోళ్లను తగ్గించాలని సూచించారు.

అలాగే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారానికి కనీసం ఒకరోజు ప్రజా రవాణాను ఉపయోగించాలని, ప్రతి వారం “నో వెహికల్ డే” పాటించాలని పిలుపునిచ్చారు.