టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా తాజాగా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆమె అర్ష్ ఔలఖ్ ను ఏప్రిల్ 26న వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

మెహ్రీన్ తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ, “కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను” అని ప్రకటించారు. ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్‌గా జరిగాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక మెహ్రీన్ తెలుగు ప్రేక్షకులకు కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా ద్వారా పరిచయమయ్యారు. తర్వాత ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించారు.