అమెరికా తెలుగు సంఘం (ఆటా) జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో జరగనున్న 19వ ఆటా జాతీయ మహాసభలు, యువజన సదస్సును గ్రాండ్ గా నిర్వహిస్తుంది.
ఈ మహాసభలను పురస్కరించుకుని ఫ్రిస్కోలో నిర్వహించిన ఫండ్ రైజింగ్ ఈవెంట్ కి విశేష స్పందన లభించింది.
ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి, కన్వెన్షన్ కన్వీనర్ బానాల శ్రీధర్ తదితరులు పాల్గొని మహాసభల ఏర్పాట్లపై ప్రసంగించారు.
తెలుగు వారందరూ పెద్ద సంఖ్యలో ఈ మహాసభలకు హాజరై గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరారు.




