అమెరికాలో తెలుగు వారిని ఒక వేదికపైకి తీసుకువచ్చే అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా ఆధ్వర్యంలో “ATA డే 2026” వేడుకలు మే 3వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం అట్లాంట నగరంలో జరగనుండగా, నిర్వాహకులు తెలుగు ప్రజలందరినీ హాజరుకావాలని ఆహ్వానించారు.
జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్‌లో జరగనున్న 19వ ఆటా మహాసభల ప్రచారంలో భాగంగా ఈ అట్లాంటా రీజినల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.
బంజారా బ్యాంక్వెట్స్ వేదికగా మే 3, 2026 ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు ఈ వేడుకలు జరుగనున్నాయి.

ఈ వేడుకల్లో పాల్గొనే వారికి రుచికరమైన విందు భోజనం, ఆకట్టుకునే సాంస్కృతిక ప్రదర్శనలు, అలాగే వినోదభరితమైన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. అదనంగా, అతిథుల కోసం కాక్టెయిల్స్ కూడా ఏర్పాటు చేశారు.













