ఉత్తర అమెరికా తెలుగు సంఘం...తానా మిడ్-అట్లాంటిక్ ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల కోసం ఒక కీలక అవగాహన సదస్సు విజయవంతంగా నిర్వహించారు. వీలునామా... విల్ అండ్ ట్రస్ట్ రూపకల్పనపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

విల్ మరియు ట్రస్ట్ వంటి ముఖ్యమైన న్యాయ పత్రాల ప్రాముఖ్యతను నిపుణులు వివరించారు. అలాగే
ఉచిత న్యాయ సలహాలు, నోటరీ సేవలు కూడా అందించారు. ఈ కార్యక్రమంలో పలు తెలుగు కుటుంబాలు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని ముఖ్య పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి నిర్వాహకులను అభినందించారు. ప్రవాసాంధ్రులలో చట్టపరమైన అవగాహన పెంపొందించడంలో ఈ సదస్సు కీలకంగా నిలిచిందని పలువురు కొనియాడారు