అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ టోర్నమెంట్ కి విశేష స్పందన లభించింది. పెన్సిల్వేనియాలోని ఎక్స్టన్‌లో జరిగిన ఈ పోటీలో 100 మందికి పైగా యువ క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభ, ఉత్సాహం మరియు క్రీడాస్ఫూర్తిని అద్భుతంగా ప్రదర్శించారు.

ట్రైబ్రిడ్జెస్ చెస్ క్లబ్ వ్యవస్థాపకులు , ప్రెసిడెంట్ ఆఫ్ ది చెస్ జర్నలిస్ట్స్ ఆఫ్ అమెరికా జోషువా ఆండర్సన్ (Joshua Anderson) పర్యవేక్షణలో ఈ టోర్నమెంట్ నిర్వహించారు.

నాన్-రేటెడ్, రేటెడ్ రెండు కేటగిరీలలో ఈ పోటీలు జరిగాయి. ప్రతి విభాగంలో విజేతలకు ట్రోఫీలు అందించారు. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.

ATA ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ రామసహాయం రెడ్డి నేతృత్వంలో... బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు (BOT) రాజు కక్కెర్ల, పరమేష్ భీంరెడ్డి, హను తిరుమలరెడ్డి, రీజనల్ డైరెక్టర్లు అరుణ్ రుద్ర, సతీష్ బండి, రీజనల్ అడ్వైజర్లు కిరణ్ అలా, ప్రశాంత్ గుడుగుంట్ల, మహేష్ దాచేపల్లి , ఇతర కార్యవర్గ సభ్యులు ఈ టోర్నమెంట్ విజయవంతం కోసం కృషి చేస్తున్నారు.

ఈ ఈవెంట్ లో పాల్గొన్న క్రీడాకారులు మరియు నిర్వాహకులను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమం ద్వారా తెలుగు సమాజ యువతలో చెస్ పట్ల ఆసక్తి మరింత పెరిగిందని నిర్వాహకులు తెలిపారు.

అలాగే బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న “19వ ATA కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు.